సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (13:52 IST)

చోరీకి గురైన సింగర్ గరిమా జైన్‌ ఫోన్.. పబ్‌కు వెళ్తే..?

Garima
Garima
బాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ గరిమా జైన్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. గరిమా జైన్ నటి, సింగర్, కథక్ డాన్సర్ కూడా. ముందుగా ఆమె టీవీ షోలలో కనిపించింది. ఇటీవలే రాణి ముఖర్జీ లీడ్ రోల్‌లో నటించిన మర్‌దాని 2 సినిమాలో గరిమా నటించారు.
 
ఇకపోతే.. గరిమా ఏప్రిల్ 2న ఫ్రెండ్స్‌తో కలిసి ముంబై ఎయిర్ పోర్టుకు దగ్గర్లో ఉన్న పబ్‌కు వెళ్లింది. అయితే అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసింది. అయితే తెల్లవారుజామన 3.15 సమయంలో పబ్ నుంచి తిరిగి బయల్దేరింది.
 
అయితే ఆ సమయంలో గరిమా తన ఫ్రెండ్స్‌కు కాల్ చేసేందుకు ఫోన్ కోసం చూసింది. అయితే తన సెల్ ఫోన్ దొరకలేదు. దీంతో అంతా వెతికింది ఎక్కడా ఫోన్ కనిపించలేదు. వెంటనే ఆమె పబ్ నిర్వాహకులతో పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.