పెట్రోల్, డీజిల్‌పై 80 పైసలు వడ్డింపు.. 12 రోజుల్లో 10 సార్లు
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శనివారం (ఏప్రిల్ 2)న లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 80 పైసలు చొప్పున వడ్డించాయి. గడిచిన 12 రోజుల్లో 10 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 7.20 పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.61 సెంచరీ దాటేయగా.. డీజిల్ ధర మాత్రం 93.87కు పెరిగింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.30 పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ.102.43 పెరిగింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.118.20 ఉండగా, డీజిల్ ధర రూ.103.94 పెరిగింది.