గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (15:34 IST)

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు.. గడిచిన 8 రోజుల్లో..?

Fuel prices
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో చమురు ధరలు పెరగడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఈ క్రమంలో మంగళవారం (మార్చి 29) లీటర్‌ పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌ పై 70 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఇలా మార్చి 22న పెట్రోల్‌పై 80పైసలు, 23న 80 పైసలు, 25వ తేదీన 80పైసలు, 26న 80 పైసలు మేర పెట్రోల్ ధరలు పెరిగాయి. కానీ 27వ తేదీ మార్చిన 50 పైసలకు , పెట్రోల్ ధరల పెంపులో 50 పైసలుగా వుండగా, 28వ తేదీ 30 పైసలు మేర పెరిగింది. ఇకపోతే మంగళవారం  (మార్చి 29)న మళ్లీ పెట్రోల్ ధర లీటర్ పై 80 పైసలు మేర పెరిగింది. 
Diesel
 
అలాగే డీజిల్ ధరల సంగతికి వస్తే... 
మార్చి 22న లీటరు డీజిల్‌పై 80పైసలు, 23న 80 పైసలు, 25వ తేదీన 80పైసలు, 26న 80 పైసలు మేర ధరలు పెరిగాయి. కానీ 27వ తేదీ మార్చిన 55 పైసలకు, డీజిల్ ధర పెరిగింది. 28వ తేదీ 35 పైసలు మేర పెరిగింది. ఇకపోతే మంగళవారం  (మార్చి 29)న మళ్లీ డీజిల్ ధర లీటర్ పై 80 పైసలు మేర పెరిగింది.