1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Petrol Crosses Rs 100/Litre In Delhi After 80 Paise Hike, Diesel Up 70 Paise

భగ్గుమంటున్న ఇంధన ధరలు.. ఢిల్లీలో సెంచరీ కొట్టింది..

Diesel
దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో వరుసగా ఏడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ పై 80 పైసలు, డీజిల్ పై 70 పైసలు పెరిగాయి. 
 
ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని.. ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ధర పెంపునకు రష్యా- ఉక్రెయిన్ యుద్ధమే కారణమన్న కేంద్రం వాదనను విపక్షాలు తోసిపుచ్చాయి. 
 
ఇకపోతే.. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఢిల్లీలో పెట్రోల్  వంద రూపాయల 21 పైసలు, డీజిల్ 91 రూపాయల 47 పైసలకు పెరిగింది. 
 
హైదరాబాద్ లో పెట్రోల్ 113 రూపాయల 61 పైసలు, డీజిల్ 99 రూపాయల 84 పైసలకు చేరింది. విశాఖలో పెట్రోల్ 113 రూపాయల 43 పైసలు, డీజిల్ 99 రూపాయల 47 పైసలకు ఎగబాకింది. 
తర్వాతి కథనం
తెలంగాణాలో వరుస రోడ్డు ప్రమాదాలు