గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (10:11 IST)

వాహనదారులకు పెట్రోల్ మంట.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

వాహనదారులకు మరోసారి పెట్రో మంట తగిలింది. లీటర్ పెట్రోల్‌పై 80 పైసలు, లీటర్ డీజిల్ పై 80 పైసలు పెంచుతూ దేశంలో ఉన్న చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
వారం రోజుల్లో నాలుగో సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన 5 రోజుల్లో 4 సార్లు ధరలు పెరగగా.. లీటర్ పెట్రోల్ ధరపై రూ. 3.20 వరకు పెరిగింది. 
 
కాగా తాజా ధర ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.71 కు చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 98.30 కి చేరింది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.56 కి చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 99.54కు చేరుకుంది.