శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (12:03 IST)

గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై ఆందోళనలు

గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై ఆందోళనలు చేపట్టాలని తెరాస శ్రేణులకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం హద్దు పద్దూ లేకుండా గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. 
 
కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిరసన ప్రదర్శనలకు తెరాస ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఉద్దృతం చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మంగళవారం నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కేసీఆర్ తెలిపారు. కేంద్ర చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా ఆందోళనలు చేపట్టాలన్నారు.