బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (10:03 IST)

హనుమకొండలో రాహుల్ బహిరంగ సభ - భారీగా ఏర్పాట్లు

rahulgandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మే ఆరో తేదీన జరిగే ఈ బహిరంగ సభకు ఐదు లక్షల మందిని జనసమీకరణ చేయాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ఉండేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. 
 
ఈ సభ ద్వారా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసే చర్యల్లోభాగంగా ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. రాహుల్ సభ కోసం జన సమీకరణపై ఇప్పటి నుంచే టీ కాంగ్రెస్ నేతలు దృష్టిసారించారు. 
 
ముఖ్యంగా, మధు యాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితలు క్రియాశీలకంగా వ్యవహిరస్తున్నారు. ఈ బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది.