1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (13:12 IST)

పెట్రో బాదుడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చమురు ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలపై తీవ్రంగా ఉంది. దీంతో అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే, వాహనదారులు కూడా లబోదిబో మంటున్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని విపక్ష పార్టీలు నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో పెట్రో ధరల బాదుడుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిరంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ భవనంలోని గాంధీ విగ్రహం వరకు నిరసన మార్చ్ నిర్వహించారు. గత పది రోజుల్లో 9 సార్లు పెట్రో, డీజల్ ధరలు పెరిగాయంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అంటే గత పది రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.6.40 పైసలు చొప్పున పెరిగిందని వారు గుర్తుచేశారు.