శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (10:26 IST)

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్? : కీలక మంతనాలు

వరుస ఓటములతో కుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం కోసం పరితపిస్తుంది. ఇందులోభాగంగా, పార్టీని కింది స్థాయి నుంచి పునర్‌వ్యవస్థీకరించేలా ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం అనేక కఠిన చర్యలను తీసుకునేందుకు సిద్ధమవుతుంది. 
 
అదేసమయంలో 2024లో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరుపుతుంది. పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేపడుతున్నారు. 
 
గుజరాత్ రాష్ట్రంలో పాతుకుపోయిన బీజేపీని గద్దె దించేందుకు ప్రశాంత్ కిషోర్ బాగా ఉపయోగపడతారని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆయన్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతోంది. అయితే, పార్టీలో కొందరు పీకేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.