మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (19:20 IST)

కాంగ్రెస్‌ నేత తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్‌ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. 
 
2005-2009 మధ్యకాలంలో మధు కోడా ప్రభుత్వంలో తిర్కీ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.6,28,698 అక్రమంగా సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి.
 
సామాజిక కార్యకర్త రాజీవ్‌ శర్మ 2009లో దిగువ కోర్టులో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయగా.. ట్రయల్స్‌ కోర్టు జూలై 1,2009న విచారణకు ఆదేశించింది. 1 ఆగస్టు 2010లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బంధు తిర్కీపై కేసు నమోదు చేసింది సీబీఐ.