ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (11:37 IST)

కడప ఉక్కుకు అనుకూలంగా 120 మంది ఎంపీలతో సంతకాల సేకరణ

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అయితే, ఏపీలోని అధికార వైకాపా మాత్రం లోపాయికారిగా మద్దతు తెలిపి, బయటకు మాత్రం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంది. తాజాగా వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టుంది. 
 
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసంగా తాము చేపట్టబోయే పోరాటంలో మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేసే దేశగా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులోభాగంగా 120 మందికి పైగా ఎంపీలతో సంతకాలు చేయించి, దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవ్వనుంది. ఈ మేరకు మంగళవారం పార్లమెంటరీ వైకాపా పార్టీ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. 
 
లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. అందువల్ల ఉక్కు ప్రైవేటీక రణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దీనికి అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.