1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (20:08 IST)

నూజివీడు బస్తీ అభివృద్ధిపై వైకాపా, టీడీపీ సవాళ్లు

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ అభివృద్ధిపై అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో నూజివీడు పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 
 
నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, తనతో చర్చించేందుకు టీడీపీ నేతలు ఎవరైనా సరే ముందుకు రావాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వర రావులు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. 
 
దీంతో పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలను తమతమ ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.