శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (14:55 IST)

బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

jail
65 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా వున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగి రెండేళ్లు గడిచిన నేపథ్యంలో నిందితుడికి స్పెషల్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని పాలికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక 2020 ఆగస్ట్‌ 20న తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి పొలంలోకి వెళ్లింది. వాళ్లిద్దరూ బాలికను చెట్టు కింద కూర్చోపెట్టి పని చేసుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో 65 ఏళ్ల వ్యక్తి బాలికను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తాతయ్య ఫిర్యాదు మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును స్పెషల్ కోర్టు రెండేళ్ల పాటు విచారించి తాజాగా తుది తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది.