1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 20 మే 2025 (21:20 IST)

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

cheese
ఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా క్యాల్షియం లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. 45 ఏళ్లు పైబడిన దగ్గర్నుంచి మెనోపాజ్ సమస్య ఉత్పన్నమవగానే శరీరంలో క్యాల్షియం తగ్గిపోయి ఇబ్బందిపడుతున్నారు. కనుక ఇలాంటివారు క్యాల్షియం పుష్కలంగా వున్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పాలు, పెరుగు, జున్న వంటి పాల ఉత్పత్తులలో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. 
గసగసాలు, నువ్వులు, అవిసె గింజలు, చియా గింజలు, బాదం పప్పు వంటివి తింటుంటే శరీరానికి క్యాల్షియం అందుతుంది.
క్యాల్షియంతో ఎముకలు పుష్టిగా వుండాలంటే పాలకూర, కరివేపాకు, ఇతర ఆకు కూరలు, కాయధాన్యాలు తినాలి. 
నారింజ, బొప్పాయి, ఇతర సీజనల్ పండ్లు తింటుంటే శరీరానికి క్యాల్షియం అందుతుంది. 
సాల్మన్ వంటి చేపలు తింటుంటే క్యాల్షియం చేకూరుతుంది. 
తృణధాన్యాలు, నారింజ రసం వంటి బలవర్థకమైన ఆహారాల్లో క్యాల్షియం సమృద్ధిగా వుంటుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.