వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?
రోజూ ఉదయం, రాత్రి వేళల్లో మహిళలు ఖర్జూరాలు తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే వేసవి కాలంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఖర్జూరాలు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను సంరక్షిస్తుంది. ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలం. ఇందులో పీచు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు ఉన్నాయి.
వేసవి కాలంలో శరీర ఉష్ణం పెరగడం వల్ల అలసట ఏర్పడటం సహజం. ఇందులో సహజసిద్ధమైన చక్కెర శరీరానికి సహజంగా అందించడం సురక్షితమైనదిగా సహాయపడుతుంది. వేసవికాలంలో వీటిని తీసుకోవడం ద్వారా అలసట వుండదు. ఇందులోని పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.
ప్రతిరోజూ ఉదయం, రాత్రి ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపడుతుంది. ఇంకా శరీర వేడిని తగ్గిస్తుంది. ఇంకా ఆరోగ్యానికి హాని కలిగించే యాంటీఆక్సిడెంట్‌ల నుంచి ఇది కాపాడుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి వేసవి కాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి మనల్ని రక్షించడానికి సహాయపడుతుంది.
అలాగే ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులోని కాల్షియం, మెగ్నీషియం వంటివి ఎముకలకు శక్తినిస్తాయి. వేసవి కాలంలో మాత్రమే కాకుండా ఏ సీజన్‌లోనైనా ఖర్జూరాలు తినడం వల్ల ఎముకలను బలంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది.