బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 ఏప్రియల్ 2025 (13:22 IST)

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

ajith - shalini
తన కోసం తన భార్య షాలిని ఎన్నో త్యాగాలు చేసిందని, ఈ క్రెడిట్ అంతా ఆమెదే అని 'పద్మభూషణ్' అజిత్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది తనకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య షాలినిపై ప్రశంసల వర్షం కురిపించారు. తన కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. 
 
'నేను ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంతటి విజయాన్ని సాధించినందుకు ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ స్థాయిలో ఉండటానికి నా భార్య షాలినినే కారణం. ఆమె నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ప్రతి పనిలోనూ నాకు తోడుంటుంది. ఒక్కోసారి నేను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయినా ఆమె నాకు అండగా నిలుస్తుంది. 
 
నన్ను ఎపుడూ నిరుత్సాహ పరచలేదు. నా కష్ట సమయాల్లో పక్కనే ఉండి భరోసానిచ్చింది. నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా ఆమెకే ఇస్తాను. ఎంతో ప్రజాదారణ పొందిన నటి అయినప్పటికీ నా కోసం అన్నింటికీ దూరమైంది. ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. 
 
నేను కేవలం నటుడుని మాత్రమే. నటన నాకు జీవితాన్నిచ్చే ఓ ఉద్యోగంగా భావిస్తాను. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. ఎందుకంటే అలాంటి ట్యాగ్స్‌పై నాకు నమ్మకం లేదు. 33 యేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నా వృత్తిని ప్రేమిస్తాను. జీవితమంతా అభిమానులను ఆలరించడానికే ప్రయత్నిస్తాను. సాధ్యమైనంతవరకు సాదాసీదాగా ఉంటాను. అతిగా ఆలోచించను. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు అంగీకరించను. నటనతో పాటు నా ఇతర ఆసక్తులపై కూడా దృష్టిసారిస్తాను' అని చెప్పుకొచ్చారు.