బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2025 (18:50 IST)

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

Ajit car accident
తమిళ చిత్రపరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనే నిమిత్తం ఆయన దుబాయ్‌లో కార్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా, ఆయన నడుపుతున్న కారు నియంత్రణ కోల్పోయి రేస్ ట్రాక్‌లో ఉండే డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు గింగర్లు తిరుగుతూ ఆగిపోయింది.

ఈ ప్రమాదంలో అజిత్‌కు ఎలాంటి గాయాలు తగలలేదు. పైగా, ప్రమాదం జరిగిన తర్వాత సహాయక సిబ్బంది వచ్చి కారు డోర్ ఓపెన్ చేయడంతో అజిత్ కుమార్ కారులో నుంచి క్షేమంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో అజిత్ కుమార్ తృటిలో పెనుగండం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.