సంబంధిత వార్తలు
- హైదరాబాద్‌లో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ కీలక షెడ్యూల్ పూర్తి
- గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్
- మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ
- గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల
- అజిత్ కుమార్ కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రకటన
మాడ్రిడ్ లో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంపార్టెంట్ షూటింగ్ షెడ్యూల్
Ajith Kumar
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాడ్రిడ్ లో జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్ లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై క్రూషియల్ సీన్స్ షూట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ అజిత్ కుమార్ స్టన్నింగ్ లుక్ ని రిలీజ్ చేశారు. వైట్అండ్ వైట్ సూట్ లో ఛార్మింగ్ స్మైల్ లో డైనమిక్ గా నిలుచున్న అజిత్ లుక్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మార్క్ ఆంటోని' తో విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా గుడ్ బ్యాడ్ అగ్లీని తీసుకువస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్న ఇండియన్ సినిమాలో ఒక హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ .ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ అభిమానులకు, ఆడియన్స్ కు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి సిద్ధంగా ఉంది.
