Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ పుష్కలంగా వుంటాయి. ఇది పిల్లలకు పెద్దల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఎముకలు, దంతాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే, పెరుగు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ పెరుగుకు డ్రై ఫ్రూట్స్ జోడించడం వాటిని పిల్లలకు అందించడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
ముఖ్యంగా బాదం పప్పులతో పెరుగును జోడించి పిల్లలకు ఇవ్వడం వల్ల విటమిన్ ఇ, మెగ్నీషియం, మోనోశాచురేటెడ్ కొవ్వులు వారి శరీరానికి లభిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మం, కండరాల పనితీరు, ఎముకల ఆరోగ్యం, హృదయనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇంకా పిస్తాపప్పులను పెరుగుతో కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా ప్రోటీన్, ఫైబర్ లభిస్తుంది. పిస్తాపప్పులు విటమిన్ బీ6, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. అందుకే నట్స్‌తో పెరుగును జోడించి పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి శరీరానికి పోషకాలు అందించిన వారమవుతాం.