సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (11:51 IST)

సర్కారు వారి పాట కోసం మహేష్ బాబుతో మాస్ సాంగ్

Mahesh leg
Mahesh leg
అన్న న‌డిస్తే మాస్‌, క‌దిలిస్తే మాస్‌.. అన్న‌ట్లు.. సూపర్ స్టార్ మహేష్ బాబు  కాళ్ళకి రెడ్ కర్ట్చీప్ కట్టుకొని వున్న స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసి ఆయ‌న‌పై ఓ మాస్ సాంగ్ చిత్రీక‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. 
 
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాటస‌ షూటింగ్ చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. షూటింగ్ లో బాగంగా ఒక మాస్ సాంగ్ ని భారీ సెట్ లో  చిత్రీకరిస్తున్నారు. దీంతో
సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
 
Parasuram- Sekar master
Parasuram- Sekar master
ఈ చిత్రానికి ఎస్ థమన్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలు విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచాయి.
 
 ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్ , డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్న పాట మాస్ సాంగ్ గా ఉండబోతుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి  కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ లో బాగంగా యూనిట్ లొకేషన్ స్టిల్స్ ని విడుదల చేశారు. కాళ్ళకి రెడ్ కర్ట్చీప్ కట్టుకొని మహేష్ చాలా మాస్ గా ఇందులో కనిపించారు.  ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్‌ని వేశారు.
 
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయిక.
 
ఆర్ మధి సినిమాటోగ్రఫర్ గా,  మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ప్ర‌కాష్ ఆర్ట్  డైరెక్టర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న 'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచవ్యాప్తంగా
గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.
 
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల, 
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, 
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సీఈవో: చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ - యుగంధర్