శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (13:16 IST)

కళావతి పాటకు స్టెప్పులేసిన లయ.. వీడియో వైరల్

Laya
Laya
టాలీవుడ్ సీనియర్ నటి లయ.. సినిమాల్లో కనిపించి చాలాకాలమే అయ్యింది. పైగా ఒకప్పుడు లయ.. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్‌గా ఉండేది కాదు. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ.. తన ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. 
 
తాజాగా తన స్నేహితులతో కలిసి కళావతి పాటకు స్టెప్పులేసి.. ఫాలోవర్స్‌కు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసింది లయ. అచ్చం మహేష్ బాబు మాదిరిగా లయ వేసిన స్టెప్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
 
ఈ అమ్మడిపై నెటిజన్స్ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరిగి సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు. సర్కారు వారి పాట చిత్రం విషయానికి వస్తే.. ఇక ఈ సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Laya Gorty (@layagorty)