సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (17:39 IST)

ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు

Mahesh babu
Mahesh babu
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు టాప్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయడంలో ముందుంటారు. తాజాగా ఖరీదైన యాడ్ మహేష్ బాబు ఖాతాలో పడింది. మహేష్ అత్యంత ఖరీదైన కారు ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ సంతకం చేశారు. త్వరలో విడుదల కానున్న ఆడి తాజా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రమోట్ చేయనున్నారు. తద్వారా మహేష్ బాబు ఆడి ఇండియా ఫ్యామిలీలో చేరారు.
 
ఎనిమిది నంది అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, నాలుగు సౌత్ ఇండియన్ అవార్డులతో సహా 25పైగా సినిమాలకు చేసి అనేక ప్రశంసలు అందుకున్న సూపర్‌స్టార్‌ ఆడి కారును ప్రమోట్ చేశారు. 
 
కాగా ప్రస్తుతం మహేష్ బాబు "సర్కారు వారి పాట"సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. సర్కారు వారి పాట మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.