గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (12:42 IST)

సూపర్ స్టార్ కృష్ణకు ఏమైంది.. ఆ ముఖంపై మచ్చలేంటి?

krishna
తెలుగు సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంబారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందళనకు గురిచేశాయి. కృష్ణ ముఖంపై పెప్దెద్ద మచ్చలు కనిపించడంతో ఆయనకు ఏదో అయిందంటూ ప్రచారం జరిగింది. 
 
ఈ నేపథ్యంలో కృష్ణ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇన్విజిబుల్‌గా ఉండే ఫేస్‌మాస్క్ ధరించారని, అది ముఖంలో కలిసిపోడం వల్ల అలా కనిపించిందని క్లారిటీ ఇచ్చారు. పైగా, ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.దీంతో ఆయన అభిమానులు ఊపిర పీల్చుకున్నారు. 
 
కాగా, ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ తన ఇంటికే పరిమితమయ్యారు. వయోభారం కారణంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారు. తన కుటుంబానికి చెందిన అత్యంత సమీప బంధువుల కార్యక్రమాలకు హాజరైనపుడు మాత్రమే ఆయన కనిపిస్తున్నారు.