సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా ఆరాధించండి... ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాలకృష్ణ ఆదిలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనస్పూర్తిగా ఆరాధించాలంటూ ఉచిత సలహా ఇచ్చారు.
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులకు పలు సూచనలు చేశారు. జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే సీఎం జగన్‌ను ఆరాధించాలని కానీ ఆరా తీయొద్దంటూ సలహాలిచ్చారు. ఆరాతీయడమే తమ ఉద్యోమని జర్నలిస్టులు మంత్రికి సమాధానమిచ్చారు.
పైగా, "సీఎం జగన్‌ను ఆరాధించాను కాబట్టే తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. అలాగే, చిత్తశుద్ధితో ఆరాధిస్తే మీ కల నెరవేరుతుంది" అంటూ సలహా ఇచ్చారు.