సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (15:38 IST)

బాలినేని ఇంటికి మూడోసారి సజ్జల రామకృష్ణారెడ్డి

balineni srinivas reddy
మంత్రిపదవి దక్కలేదని అలకపాన్పునెక్కిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, బాలినేని ఇంటికి సజ్జల మూడోసారి వెళ్లారు. ఇప్పటికే రెండు పర్యాయాలు మాజీ మంత్రికి ఇటికి వెళ్లినా బాలినేని ఆగ్రహం చల్లారలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన తనను తప్పించి, విద్యాశాఖామంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ను ఏ విధంగా కొనసాగిస్తారంటూ సజ్జను బాలినేని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల జిల్లాలో పట్టుకోల్పోతానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన తన తదుపరి కార్యాచరణపై సోమవారం తన సహచరులతో మంతనాలు జరుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ముచ్చటగా మూడో పర్యాయం కూడా బాలినేని ఇంటికి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. ఆయన వెంట పార్టీ సీనియర్లు గండికోట శ్రీకాంత్ రెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురాం పాటు మరికొందరు నేతలు భారీ సంఖ్యలో ఇంటికి వెళ్లారు. సీఎం జగన్ ఆదేశం మేరకే బాలినేని ఇంటికి సజ్జల మూడో పర్యాయం కూడా వెళ్లినట్టు సమాచారం. బాలినేనితో స్వయంగా తానే మాట్లాడుతానని, అందువల్ల బాలినేనిని తన వద్దకు తీసుకునిరావాలని సజ్జలను కోరినట్టు సమాచారం.