బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (14:54 IST)

గుజరాత్‌లో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం

blast
గుజరాత్ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. రియాక్టర్ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓం ఆర్గానికి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. 
 
గుజరాత్ రాష్ట్రంలోని బారుచ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించగానే ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
అహ్మదాబాద్‌కు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహేజ్ ఇండస్ట్రియల్ పార్కులోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగింది. పేలుడు జరిగినపుడు ఫ్యాక్టరీలో సాల్వెంట్ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.