శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:30 IST)

శనివారం రాత్రి ఆకాశం నుంచి భూమి వైపు దూసుకొచ్చిన మండుతున్న అగ్నిగోళం

శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఆకాశంలో ప్రకాశవంతమైన ఖగోళ గోళం లాంటి వస్తువు ఒకటి ఆకాశం నుంచి దూసుకు వస్తూ కనిపించింది. అగ్నిగోళం లాంటి వస్తువు అతివేగంతో భూమివైపు దూసుకురావడాన్ని చూసి జనం జడుసుకున్నారు. కొందరు రోడ్లపైకి పరుగులు తీసారు.

ఆకాశం నుండి మండుతూ వస్తున్న ఆ వస్తువు ఉల్క అని అనుకున్నారు. కానీ ఉల్క చాలా వేగంగా వచ్చి భూ వాతావరణంలో భస్మమైపోతుంది. కానీ ఇక్కడ కనిపించిన వస్తువు మాత్రం కాస్త నిదానంగా వస్తూ కనిపించింది. దీనితో ఆ మండుతున్న గోళం భూమిని తాకుతుందేమోనని దాన్ని చూసిన వారు ఆందోళన చెందారు.
 
ఐతే అది భూమికి చేరువ కాలేకపోయింది. ఈ వస్తువు అంతరిక్ష ఉపగ్రహానికి చెందిన శిధిలాలని అంతరిక్ష నిపుణులు ధృవీకరించారు. అంతరిక్ష వ్యర్థాలు ఎప్పటికప్పుడు భూమిపై పడుతున్నాయి. వీటిపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.