సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (15:19 IST)

దేశంలో భానుడి ప్రతాపం: ఆ 12 ప్రాంతాల్లో భగ్గుమంటున్న ఎండలు..?

Summer
దేశంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకీ ఎండలు ముదరడంతో జనం భయపడిపోతున్నారు. మార్చిలోనే భానుడు జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా దేశంలో 12 నగరాల్లో భానుడు మండిపోతున్నాడు. 
 
ఈ క్రమంలో మధ్యప్రదేశ్ కార్గోన్‌లో 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే దేశంలోని 12 హాటెస్ట్ ప్లేసెస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 
Summer
 
ఇక గుజరాత్ ఖాండాలో 42.6 డిగ్రీలు, రాజ్‌కోట్‌ (గుజరాత్) 42.3, అమ్రేలి (గుజరాత్) 42.2, ఖాండ్వా (మధ్యప్రదేశ్) 42 డిగ్రీలు, నర్మదపురం (మధ్యప్రదేశ్) 42 డిగ్రీలు, బర్మేర్ (రాజస్థాన్) 41.9 డిగ్రీలు, జైసాల్మర్ (రాజస్థాన్) 41.6 డిగ్రీలు, బుజ్ (గుజరాత్) 41.6, అహ్మదాబాద్ (గుజరాత్) 41.3 డిగ్రీలు, గ్వాలియర్  (గుజరాత్)  41 డిగ్రీలు, ఢిల్లీలో 39.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
అందుచేత ప్రజలు అవసరం మేరకు బయట తిరగాలని.. లేని పక్షంలో ఇంటికి పరిమితం అయితే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.