బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (11:50 IST)

రెండేళ్ళ తర్వాత ప్రారంభమైన అంతర్జాతీయ విమాన సర్వీసులు

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీ చేసిన ఆదేశం ప్రకారం, మహమ్మారి ప్రారంభమైన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, ఆదివారం నుంచి సాధారణ విదేశీ విమానాలను పునఃప్రారంభించింది. మార్చి 2020 నుండి అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించారు. 
 
ఆదివారం నుంచి అన్ని విదేశీ విమానాలు పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. క్యాబిన్ క్రూ సభ్యులు ఇకపై వ్యక్తిగత రక్షణ పరికరాలను (PPE) ధరించాల్సిన అవసరం లేదు. అదేసమయంలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది మాత్రం ప్రయాణీకుల కోసం అవసరమైన శోధనలను కొనసాగించవచ్చు.
 
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెల్సిందే. అన్ని రకాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు చక్కబడటంతో ఈ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు సమ్మతించింది.