సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (13:58 IST)

దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజివిట్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1259 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చుకుంటే కొంతమేరకు తగ్గాయి. అదేసమయంలో ఈ వైరస్ నుంచి 1705 మంది కోలుకో 35 మంది మృత్యువాతపడ్డారు. 
 
ప్రస్తుతం దేశంలో 15,378 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 4,24,85,534 మందికి కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటివరకు 5,21,070 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశంలో ఇప్పటివరకు 1,83,53,90,499 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ప్రస్తుతం కరోన్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.