1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (14:02 IST)

వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నాకు అస్సలు ఇష్టంలేదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

కోవిడ్ 19 కారణంగా ఐటీ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఐతే ఇలా పని చేయడంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. కోవిడ్ తీవ్రత తగ్గింది కనుక ఇక నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు వచ్చేట్లు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

 
బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కి తను పెద్ద అభిమానిని కాదన్నారు. ఇంటి నుంచి పనిచేసేవారిలో సృజనశీలత తగ్గిపోయి పనిలో నాణ్యత వుండదన్నారు.


అంతేకాదు... కంపెనీల ఉత్పాదకత కూడా క్రమంగా పడిపోతూ వుందని ఆయన వెల్లడించారు. అందువల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇక స్వస్తి చెప్పి అందరూ కార్యాలయాలకు వచ్చేలా ఐటీ కంపెనీలు ప్రోత్సహించాలంటూ చెప్పారు.