1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Covid Media Bulletin in India,

దేశంలో భారీగా తగ్గిపోయిన కరోనా పాజిటివ్ కేసులు

Covid 19
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 142 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత 24 గంటల్లో కరోనా నుంచి 14,947 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,151 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. 
 
అదేవిధంగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,23,53,620గా ఉంది. కరోనా వైరస్ పాజిటివ్ రేటు 0.74 శాతంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 178.02 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తదుపరి దండయాత్ర తైవాన్ మీదే : డోనాల్డ్ ట్రంప్ జోస్యం