1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (10:29 IST)

యూఎస్ జనరల్ అసెంబ్లీలో రష్యాపై తీర్మానం.. ఓటింగ్‌కు దూరంగా భారత్

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో రష్యాకు వ్యతిరేకంగా మరోమారు ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌కు భారత్ మరోమారు దూరంగా ఉన్నది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యాత్రకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల సమావేశం తాజా జరిగింది. ఇందులో మొత్తం 193 మంది దేశాల ప్రతిధులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జరిగిన తీర్మానానికి 141 దేశాలు మద్దతు తెలుపగా, ఐదు దేశాలు వ్యతిరేకంగా అంటే రష్యాకు అనుకూలంగా ఓటు వేశాయి. మరో 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వీటిలో ఒకటి భారత్ కూడా ఉంది. 
 
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులను తక్షణం నిలిపివేయాలని, దాని సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ఐక్య, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండాలని ఐక్యరాజ్య సమితి సభలో (యూఎన్ జనరల్ అసెంబ్లీ)లో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 141 దేశాలు మద్దతు తెలుపాయి. ఇపుడు రష్యా వైఖరి ఏ విధంగా ఉంటుందో వేచిచూడాల్సివుంది.