మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (20:28 IST)

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి

ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా భారత పౌరులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. అలాగే, ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. ఇప్పటికే కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ అనే వైద్య విద్యార్థి రష్యా సైనిక బలగాలు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన చందన్ జిందాల్ అనే 22 యేళ్ళ వైద్య విద్యార్థి మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో చందన్ జిందాల్ కన్నుమూసినట్టు వార్తలు వస్తున్నాయి. రక్తం గడ్డకట్టడంతో చందన్ జిందాల్‌ను తక్షణం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా జిందాల్ ప్రాణాలు కోల్పోయినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. కాగా, జిందాల్ విన్నిత్సియాలోని విన్నిత్సియా నేషనల్ పైరోగవ్ మెమోరియల్ వైద్య విశ్వవిద్యాలయంలో చందన్ జిందాల్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు.