బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (11:03 IST)

తదుపరి దండయాత్ర తైవాన్ మీదే : డోనాల్డ్ ట్రంప్ జోస్యం

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సాగుతుందని గుర్తుచేసిన ఆయన ఆ తర్వాత తైవాన్‌పై చైనా దండయాత్ర చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పైగా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను చాలా తెలివైనవాడితో పోల్చారు. 
 
ఇదే అంశంపై ఆయన తాజాగా మాట్లాడుతూ "తదుపరి దండయాత్ర తైవాన్‌పై జరగొచ్చు. చైనా అధ్యక్షుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు" అంటూ కామెంట్స్ చేశారు. పనిలో పనిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆయన మరోమారు ఘాటైన విమర్శలు చేశారు. 
 
"తైవాన్‌పై దాడి జరుగుతుందని నేను అంచనా వేస్తున్నాను. ఎందుకంటే వాషింగ్టన్‌ ఎంతో మూర్ఖంగా నడుస్తోంది. మన నాయకులను అసమర్థులుగా చూస్తున్నారు. వారు చేయాలనుకున్నది చేస్తున్నారు ఇది వారి సమయం" అని వ్యాఖ్యానించారు.