శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (15:19 IST)

ఎలుక కరిచినా కరోనా సోకుతుంది-చెన్ షీ చుంగ్

కరోనా ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా, అతడి లాలాజలాన్ని తాకినా కరోనా సోకుతున్నట్టు తేల్చారు పరిశోధకులు. అయితే, తాజాగా ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్టు తేలింది.
 
ఎలుక కరవడం వల్లే కరోనా సోకిందని తైవాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షీ చుంగ్ ప్రకటించారు. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఎలుక కరవడం వల్లే కరోనా సోకిందని తేల్చామని, మరిన్ని టెస్టులు చేశాక దానిని నిర్ధారించాల్సి ఉందని ఓ సీనియర్ వైరాలజిస్ట్ చెప్పారు. 
 
అలాగే కరోనా ఉన్న ఎలుక కరిచినట్టు తైవాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షీ చుంగ్ ప్రకటించారు. ఆమె ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకుందని తెలిపారు.
 
కాగా, అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. 
 
ఈ క్రమంలోనే యువ సైంటిస్ట్‌కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. ఆమెకు డెల్టా వేరియంట్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.