డ్రాగన్ కంట్రీ చైనాకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా
డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గట్టివార్నింగ్ ఇచ్చారు. హద్దు మీరి తైవాన్‌పై దాడి చేస్తే మాత్రం సహించబోమని, తాము చైనాపై దాడి చేస్తామని హెచ్చరించారు.
తైవాన్‌పై చైనా దాడికి తెగబడితే అపుడు తైవాన్‌ను రక్షిస్తారా అని జో బైడెన్‌ను ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ, ఒకవేళ తైవాన్‌పై చైనా దాడి చేస్తే, అప్పుడు తైవాన్‌కు అండగా పోరాడుతామని తెలిపారు.
అవును తాము ఆ విషయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే తైవాన్ అంశంలో తమ ప్రభుత్వ విధానంలో ఎటువంటి మార్పులేదని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
బైడెన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తైవాన్ స్పందించింది. చైనా అంశంలో తమ విధానం ఏమీ మారదని, ఒకవేళ డ్రాగన్ దేశం దాడి చేస్తే, తామే ప్రతిదాడి ఇస్తామని తైవాన్ పేర్కొన్నది. చాన్నాళ్ల నుంచి తైవాన్ అంశంలో అమెరికా వ్యూహాత్మక మౌనాన్ని పాటించింది. అయితే తాజాగా బైడెన్ చేసిన కామెంట్ కొంత ఆసక్తిని రేపింది.