సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:24 IST)

ఒకేరోజు వివాహం చేసుకున్న ఇరువురు క‌మెడియ‌న్లు

Avinash-Viva harsha family
క‌రోనా త‌ర్వాత పెండ్లి బాజాలు కొంద‌రు న‌టులు మోగించుకున్నారు. ఆమ‌ద్య క‌రోనా స‌మ‌యంలోనే కాస్త ఒళ్లు త‌గ్గించుకుని పెండ్లికి సిద్ద‌మైన‌ట్లు హాస్య‌న‌టి, ప‌లు సినిమాల్లో హీరోయిన్‌కు స్నేహితురాలిగా న‌టించిన విద్యుల్లేఖరామన్ ప్ర‌క‌టించింది. అలాగే ఇటీవ‌లేపెళ్లి చేసుకుంది. తాజాగా జబర్దస్త్ అవినాష్ వివాహం జ‌రిగింది. బుధ‌వారంనాడు హైద‌రాబాద్ లో అనూజ తో పెళ్లి జ‌రిగింది. వీరి వివాహానికి టీవీ తారలు వర్షిణి సౌందరరాజన్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రోల్ రిడా, సోహెల్, అలేక్య హారిక, దివి, లాస్య హాజరయ్యారు.
 
అదేవిధంగా అదే బుధ‌వారంనాడు వివా హర్ష వివాహం కూడా జ‌రిగింది. స్నేహితురాలు అక్షర రీసుతో ఈ ఏడాది జనవరిలో స్టార్ హోట‌ల్‌లో అతి కొద్ది మ‌ధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా క‌రోనా త‌గ్గాక త‌మ స‌న్నిహితులు, స్నేహితులు, కుటుంబ‌స‌భ్యులు హాజ‌ర‌య్యేలా ఆయ‌న వివాహం జ‌రుపుకున్నారు. ఈ వివాహానికి కొంద‌రు సినీరంగానికి చెందిన‌వారు హాజ‌ర‌య్యారు. వీరిద్దిరి వివాహం ఒకేరోజు జ‌ర‌గ‌డంతో వారి ఫొటోలు సోష‌ల్ మీడియాలో రావ‌డంతో అభిమానులు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.