గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (11:49 IST)

ట్రైనీ ఐఏఎస్‌పై లైంగిక వేధింపుల కేసు ... ఎక్కడ?

మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ ట్రైనీ ఐఏఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ యువతి ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. ఆ ట్రైనీ ఐఏఎస్ అధికారి పేరు బానోతు మృగేందర్‌లాల్ (30). 
 
ఈయనపై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్ ప్రస్తుతం తమిళనాడులోని మదురైలో శిక్షణలో ఉన్నారు. మృగేందర్‌లాల్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సమయంలో కూకట్‌పల్లికి చెందిన యువతి (25)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
 
ఈ క్రమంలో ఓ రోజు యువతి తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను బయటకు తీసుకెళ్లి ఆయన స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అపుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ విషయం తెలిసిన మృగేందర్ లాల్ తండ్రి అయిన టీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, తల్లి కలిసి తనను బెదిరించడంతో మిన్నకుండిపోయినట్టు తెలిపింది. ఈ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ జరుపుతున్నారు.