శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (18:21 IST)

పెళ్లి జరిగింది.. రాత్రి శోభనం కూడా జరిగింది.. తెల్లారేసరికి...?

పెళ్లి జరిగింది.. రాత్రి శోభనం కూడా జరిగింది. అయితే నవ వధువు పారిపోయింది. ఈ ఘటన తమిళనాడు తిరుప్పూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని గున్నత్తూరులో నివాసం ఉంటున్న మారప్పన్‌కు రాజేంద్రన్ (34) అనే కుమారుడు ఉన్నాడు.

సొంత పొలంలో వ్యవసాయం చేయిస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్న రాజేంద్రన్ కొన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతమంది అమ్మాయిలను చూసినా రాజేంద్రన్‌కు పెళ్లికూతురు సెట్ కాలేదు. ఆ తర్వాత ఈరోడ్డుకు చెందిన అంబిక మరో పెళ్లిళ్ల బ్రోకర్ అమ్మాయి సెట్ చేయిస్తానని లక్షకు పైగా కమిషన్ తీసుకుంది. 
 
అంబిక, వల్లియమ్మాల్ కలిసి రీసా (27) అనే అమ్మాయిని చూపించారు. రీసాను చూసిన రాజేంద్రన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. రీసాతో పెళ్లికూడా జరిగింది. రీసాతో త్వరగా పెళ్లి జరిగింది. పెళ్లి చేయించిన వారికి రూ. 1.50 లక్షలు కమీషన్.. పెళ్లి కూతురు రీసాకు కావలసిన బంగారు నగలు, పట్టుచీరలు, పెళ్లి ఖర్చులకు డబ్బు మొత్తం పెళ్లి కొడుకు రాజేంద్రన్ ఇచ్చాడు. సెప్టెంబర్ 24వ తేదీ రాజేంద్రన్, రీసాల వివాహం జరిగింది.
 
పెళ్లి జరిగిన రోజు రాజేంద్రన్, రీసా శోభనం జరిగింది. మరుసటి రోజు పెళ్లి కూతురు రీసా పెళ్లి కొడుకు రాజేంద్రన్ తీసిచ్చిన నగలు మొత్తం వేసుకుని పట్టుచీర కట్టుకుని రాజేంద్రన్‌కు కనపడింది. నా భార్య రీసా చాలా అందంగా ఉందని రాజేంద్రన్ మురిసిపోయాడు. తరువాత సొంత ఊరికి వెళ్లడానికి రాజేంద్రన్ కారు సిద్దం చేశాడు. తరువాత పెళ్లి కూతురు రీసాతో కలిసి ఊరికి వెళ్లాడు. ఆ రోజు సాయంత్రం రీసా మాయం అయిపోయింది. రీసా కోసం పెళ్లి కొడుకు రాజేంద్రన్ వెతికినా ఆమె ఆచూకి చిక్కలేదు.
 
నా భార్య రీసా కనపడటం లేదని రాజేంద్రన్ పెళ్లి చేసిన అంబికకు చెప్పాడు. పెళ్లి చెయ్యడం వరకు నా భాద్యత, తరువాత నీ ఖర్మనీది అంటూ అంబిక నిర్లక్షం చేసింది, పెళ్లి కూతురు రీసాతో పాటు ఆమె పెద్దమ్మ పెరియమ్మదేవి, తంగం మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. కొంపమునిగిందని తెలుసుకున్న రాజేంద్రన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో రీసాకు ఇంతకు ముందే శ్రీధరన్ అనే వ్యక్తితో వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని వెలుగు చూసింది.