సంబంధిత వార్తలు
- మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్
- విశ్వం నుంచి గోపీచంద్, కావ్యథాపర్ ల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
- Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్
- Sushmita : భయ పెట్టడం కూడా ఒక ఆర్ట్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్
- Adah Sharma: ఆదా శర్మ బ్యూటీ సీక్రెట్ ఇదే.. క్యారెట్, ఎర్రకారం వుంటే?
Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది
Shiva Kandukuri, Teju Ashwini
ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శివ కందుకూరి, రాజీవ్ కనకాల స్కూటీపై అలా జాలీగా తిరుగుతూ కనిపిస్తున్నారు. చూస్తుంటే అది హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వారిద్దరి నవ్వుల్ని చూస్తుంటే ఆడియెన్స్ ఇట్టే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ కథ ప్రేమ, వారసత్వం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఓ పర్ఫెక్ట్ చాయ్, కప్పులా ఉంటుంది. భావోద్వేగాలు, సంప్రదాయం, కలలతో నిండిన అద్భుతమైన ప్రయాణాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. టీజర్ అతి త్వరలో వస్తుంది అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తుండగా, క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ నర్వా ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
