సంబంధిత వార్తలు
- యూట్యూబ్‌కు లైక్స్ రావడం లేదని ట్రిబుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఎక్కడ?
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి సబిత చర్చలు - నేటి నుంచి హాజరు
- బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు
- మారువేషంలో రేవంత్ రెడ్డి: గోడదూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి జంప్
- వీసీ నియామకం కోసం బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీలో మొబైల్ ఫోన్ వినియోగంపై నిషేధం
తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గతంలో విద్యార్థులు చేసిన మెరుపు ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెల్సిందే.
దాదాపు వారం రోజుల పాటు జరిగిన ఈ ఆందోళనలో అనేకమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆందోళన చేసిన విద్యార్థులు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇది తీవ్రతరం కావడంతో తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా బాసర క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులతో చర్చలు జరిపారు. ఆమె ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులు తమ ఆందోళనను విరమించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ క్యాంపస్‍లో సెల్‌ఫోన్లు వినియోగించకుండా అధికారులు నిషేధం విధించారు. ట్రిపుల్ ఐటీలోని తరగతి గదులు, అకడమిక్ బ్లాక్, పరిపాలనా భవనాలలో సెల్ ఫోన్లు వినియోగించరాదంటూ ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ ఆదేశాలు జారీచేశారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, మొబైల్ ఫోన్లు వినియోగించకుండా నిషేధం విధించడంపై విద్యార్థులు భగ్గుమన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని, డిమాండ్లన అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టూడెంట్స్ గవర్నెన్స్ కౌన్సిల్ మండిపడింది.
