బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (13:02 IST)

జగన్‌ పర్యటనలో స్వల్ప మార్పులు..

ys jagan
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లో స్వ‌ల్ప మార్పులు చోటుచేసుకుంది. ఆయ‌న ఈ రోజు, రేపు శ్రీకాకుళం జిల్లా, హైదరాబాద్, ఢిల్లీ పర్యటనకు వెళ్ల‌నున్నారు.
 
06.08.2022 షెడ్యూల్ వివరాల్లోకి వెళితే..
మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం 3.40 గంటలకు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.

సాయంత్రం 5.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి శంషాబాద్‌ వెళ్ళనున్నారు. 
 
6.55 గంటలకు నార్సింగి ఓమ్‌ కన్వెన్షన్‌లో జీవీ.ప్రతాప్‌ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సీఎం జ‌గ‌న్‌ హాజరుకానున్నారు.

రాత్రి 7.50 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం ఢిల్లీ వెళ్ళనున్నారు. రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయ‌నున్నారు