గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (09:09 IST)

గాంధీజీ - తిలక్‌ల కంటే గొప్పోళ్లా : నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేస్తాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆ రాష్ట్ర హైకోర్టుతో పొద్దస్తమానం చీవాట్లు తింటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హాజరుకావాలని తాము ఆదేశించినా ఆయన హాజరుకాకపోడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
జాతిపిత మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్‌ల కంటే గొప్పవారా మీరు అంటూ సూటిగా ప్రశ్నించింది. మరోమారు తమ ఆదేశాలను పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడితే వివరణ కూడా కోరకుండా నానా బెయలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది. కోర్టుకు రాలేనంత తీరిక లేకుండా ఉన్నారా? అంటూ ప్రశ్నించింది.