గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (15:07 IST)

ఆర్థిక భారం లేకుండా విద్యాభ్యాసం చేయాలి : సీఎం జగన్

ys jagan
రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద విద్యార్థి ఆర్థిక భారాన్ని, ఒత్తిడిని ఎదుర్కోకుండా విద్యాభ్యాసం చేయాలన్న ముఖ్యోద్దేశ్యంతోనే ఈ పథకాన్ని విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. 
 
ఆయన గురువారం ప్రకాశం జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేశారు. 2022 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది.
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించిందని తెలిపారు. 
 
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలుస్తోందని చెప్పారు. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది.