శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (11:02 IST)

నేడు ఈ యేడాదిలో చివరి చంద్రగ్రహణం.. ఎంత సేపు కనిపిస్తుంది?

Lunar Eclipse
ఈ యేడాదిలో కనిపించే చివరి చంద్రగ్రహణం మంగళవారం కనిపించనుంది. కొన్ని నగరాల్లో ఇది సంపూర్ణంగాను, మరికొన్ని నగరాల్లో అది పాక్షికంగా కనిపించనుంది. అయితే, ఈ గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదని నిపుణులు అభిప్రాయపడున్నారు. 
 
హైదరాబాద్ నగరంలో చంద్రగ్రహణం సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభమై రాత్రి 7.26 గంటలకు ముగుస్తుంది. అంటే గంటా 46 నిమిషాల పాటు దీని ప్రభావం ఉంటుందని బిర్లా ఆర్కియాలజికల్ అస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.