శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (23:08 IST)

నవంబర్ 8న చంద్ర గ్రహణం: ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం? (video)

Lunar Eclipse
నవంబర్ నెలలో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం నవంబర్‌ 08 మంగళవారం ఏర్పడబోతోంది. నవంబర్ 08 న చంద్రగ్రహణం భారతదేశంలోని కోల్‌కతా, సిలిగురి, పాట్నా, రాంచీ, గౌహతి మొదలైన ప్రదేశాలలో సంపూర్ణంగా కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్ర వేత్తలు తెలుపుతున్నారు.   
 
ఈ సంవత్సరంలో చివరి గ్రహణం నవంబర్ 8, 2022, కార్తీక పూర్ణిమ నాడు రాబోతోంది. 2022 అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజులలోపు ఈ రెండో గ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం ప్రజల మనసుల్లో ఆందోళనను పెంచుతోంది. 
 
 


 
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, రెండు గ్రహణాలు ఒకే వైపు లేదా 15 రోజులలోపు కొన్ని పెద్ద అశుభాలకు సంకేతం. దీన్నిబట్టి చూస్తే ఇప్పుడు దేశం, సమాజం ఏదో ఒక పెద్ద కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు, రాశుల మార్పు వలె, సూర్యగ్రహణం లేదా చంద్ర గ్రహణం అయినా అన్ని రాశుల మీద కూడా గ్రహణ ప్రభావం కనిపిస్తుంది. గ్రహణం తర్వాత ఒక నెల వరకు కాలం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో గ్రహణ ప్రభావం వల్ల ఏ రాశుల వారికి లాభమో, ఏ రాశుల వారికి నష్టమో తెలుసుకుందాం.
 
నవంబర్ 8, 2022న వచ్చే ఏడాది చివరి గ్రహణం, నాలుగు రాశులకు లాభాన్నిస్తుంది. ఇందులో భాగంగా మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభరాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో, మేషం, వృషభం, కన్య, మకర రాశులకు నష్టాలు తప్పవు. మిగిలిన నాలుగు రాశుల వారు గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు పొందుతారు.
 
చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
సంవత్సరం చివరి చంద్రగ్రహణం భారతదేశంతో సహా దక్షిణ/తూర్పు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది.
  
చంద్రగ్రహణం సమయం :
చంద్రగ్రహణం 2022 తేదీ: 08 నవంబర్ (మంగళవారం)
చంద్రగ్రహణం ప్రారంభ సమయాలు: సాయంత్రం 5:32 గంటలకు
చంద్రగ్రహణం ముగిసే సమయం: సాయంత్రం 06.18 గంటలకు
సూతక కాలం ప్రారంభ సమయం: ఉదయం 09:21
సూతక కాలం ముగిసే సమయం: సాయంత్రం 06.18