శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:10 IST)

సూర్య గ్రహణ సమయంలో దుర్గాదేవిని పూజిస్తే?

Puja
అమావాస్యనాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మంగళవారం ఏర్పడే ఈ సూర్యగ్రహణం సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై 6.26 గంటలకు ముగుస్తుంది. సూర్య గ్రహణం స్వాతి నక్షత్రం నందు సంభవించడం వల్ల తులరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండటమే మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
ఈ గ్రహణం సింహ, వృషభ, మకర, ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలనిస్తుంది. కన్య, మేషం, కుంభం, మిథునం రాశులకు మధ్యస్త ఫలితాలు ఉంటాయి. తుల, కర్కాటక, మీన, వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
సూర్యగ్రహణ సమయంలో సూర్య ఆరాధన, రాహు జపం, దుర్గాదేవి ఆరాధణ చేయడం వల్ల శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం చేసి సూర్యభగవానుడిని ఆరాధించడం మంచిది.