మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (13:29 IST)

దీపావళి రోజున దక్షిణవర్తి శంఖం పూజ..

Lakshmi Devi
దీపావళి పండుగ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళిని అక్టోబర్ 24న జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మిదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే లక్ష్మీ దేవితో పాటు వినాయకున్ని పూజించడం వల్ల సంపదలకు కొరతే ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే తప్పకుండా భక్తి శ్రద్ధలతో దేవిని పూజించాల్సి ఉంటుంది. 
 
అలాగే దీపావళి సందర్భంగా అమ్మవారు శంఖాన్ని ధరిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి దక్షిణవర్తి శంఖాన్ని దీపావళి రోజున పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరమవుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.
 
దక్షిణవర్తి శంఖం ప్రయోజనాలు:
శంఖాన్ని దక్షిణాన ఉండడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావు.
శత్రుహాని వుండదు
ఇంట్లో లక్ష్మి దేవి స్థిర నివాసం ఉంటుంది.
ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది.