మంగళవారం, 12 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (10:53 IST)

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి?

diwali
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి  పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై స్పష్టమైన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. దీపావళికి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే సూర్యగ్రహణంతో సంబంధం లేకుండా పండుగను జరుపుకోవచ్చు. అమావాస్య తిథి ప్రదోష వేళ వున్న రోజునే దీపావళి నిర్వహించాలి. అది సోమవారం సాయంత్రం వున్నందున ఆ రోజే దీపావళి పండుగను జరుపుకోవాలి. అంతేకానీ మంగళవారం సూర్యగ్రహణం కాబట్టి పూజ చేయకూడదు. 
 
దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి  అమావాస్య ఘడియలు వున్న సోమవారం రాత్రి (24తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. అక్టోబర్ 24 సోమవారం రోజు చతుర్థశి తిథి సాయంత్రం ఐదు గంటల లోపు వుందని, ఐదు గంటల తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంగని తెలిపారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతుంది.